అందరికి ఉపయోగపడే విషయం షేర్ చెయ్యండి ఫ్రెండ్స్డెంగ్యూ జ్వ రానికి చెక్ పెట్టే సింపుల్ చికిత్స, బొప్పాయి ఆకులు.!డెంగ్యూ వ్యాధి వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అసలు సరిగ్గా నిలుచోలేరు. కూర్చోలేరు. బెడ్కే పరిమితం కావల్సి వస్తుంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇవే కాదు, డెంగ్యూ వచ్చిన వారి రక్తంలో ఉండే ప్లేట్లెట్ల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది. దీంతో ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. సాధారణ వ్యక్తుల్లో ప్లేట్లెట్లు 1.50 లక్షల నుంచి 4.50 లక్షల మధ్య ఉంటే డెంగ్యూ వచ్చిన వారిలో 1.50 లక్షల కన్నా తక్కువగా ఉంటుంది. గంటలు అయిన కొద్దీ ఇవి వేల సంఖ్యలో పడిపోతూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడం కోసం వైద్యులు పలు రకాల మందులను, విటమిన్ సప్లిమెంట్లను రోగులకు అందిస్తారు. రోగి కొద్దిగా కోలుకున్న తరువాత డిశ్చార్జి చేస్తారు. కానీ కొన్ని రోజుల వరకు వారు మందులను సక్రమంగా తీసుకోవాల్సిందే. సరైన ఆహారం తినాల్సిందే. లేదంటే రోగం మళ్లీ తిరగబెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే అలాంటి వారు కింద సూచించిన విధంగా ఓ చిట్కాను పాటిస్తే ప్లేట్లెట్ల సంఖ్యను త్వరగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది. ఇంతకీ ఆ చిట్కా ఏమిటంటే, బొప్పాయి పండు ఆకులు… అవును, అవే..!బొప్పాయి పండు ఆకులతో తయారు చేసిన ఓ మిశ్రమాన్ని సేవించడం వల్ల ప్లేట్లెట్ల సంఖ్యను బాగా పెంచుకోవచ్చు. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలంటే, కొన్ని బొప్పాయి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. వాటిని మిక్సీలో వేసి దాంతోపాటు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు, ఒక టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపులను కూడా వేయాలి. అనంతరం అన్ని పదార్థాలను బాగా మిక్సీ పట్టాలి. అప్పుడు వచ్చే ద్రవాన్ని వడబోసి, దానికి కొంత తేనె కలిపి నిత్యం రెండు పూటలా తీసుకోవాలి. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్తో పాటు ఈ మిశ్రమాన్ని కూడా తీసుకోవాలి. అప్పుడే గుణం కనిపిస్తుంది. దీంతో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పెరగడమే కాదు, త్వరగా వ్యాధి నుంచి కోలుకుంటారు.కింద ఇచ్చిన వీడియోను చూడ డం ద్వారా బొప్పాయి ఆకుల మిశ్ర మాన్ని ఎలా త యారు చేయ వ చ్చో తెలుస్తుంది...
đang được dịch, vui lòng đợi..
